ACB ట్రాప్: రూ.2 లక్షలు తీసుకుంటూ GHMC అధికారికి షాక్
రాష్ట్రంలో అవినీతిపై ఏసీబీ (ACB) దళాలు దూకుడు కొనసాగిస్తున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ GHMC డిప్యూటీ కమిషనర్ రవి కుమార్‌ను లంచం కేసులో అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఓ హోటల్ యజమాని నుంచి రూ.2 లక్షల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఇటీవల ఏసీబీ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. అవినీతి పెరగకుండా పెద్దస్థాయి అధికారులపైనా దాడులు […]