Blog Post

CV9 NEWS > News > Blog > జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద.. 10 గేట్లు ఎత్తివేత

జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద.. 10 గేట్లు ఎత్తివేత

జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద.. 10 గేట్లు ఎత్తివేత

👉అర్ధరాత్రి దాటిన తర్వాత పది గేట్లు ఎత్తివేత

👉అన్నదాతల కళ్ళలో ఆనందం

గద్వాల:-జూరాలకు వరద తీవ్రత పెరిగిన నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో అధికారులు పది గేట్లు ఎత్తివేశారు. గత వారం రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి నుంచి నీటిని ఉండేలా చేస్తుండడంతో నారాయణపురం మీదుగా 30 వేల క్యూసెక్కుల జలాలు జూరాలకు చేరుతూ వచ్చాయి.కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో పుష్కలంగా వర్షాలు కురుస్తుండడంతో బుధవారం 1, 35,620 క్యూసెక్కులను దిగువకు విడుదల చేయడం, బీమా నుంచి 60 వేల క్యూసెక్కుల జలాలు వస్తూ ఉండడంతో దాదాపుగా రెండు లక్షల క్యూసెక్కుల నీరు మక్తల్ నియోజకవర్గం తంగడి వద్ద ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణా నదికి వచ్చి చేరుతున్నాయి. దీనితోపాటు జూరాల ఎగువ భాగంలోను గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద తీవ్రత మరింతగా పెరిగింది. దీంతో జూరాల ప్రాజెక్టు కు సంబంధించి ముందస్తు జాగ్రత్తగా గురువారం తెల్లవారుజామున పది గేట్లు ఎత్తివేసి 44,254 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *